ఎన్నికల కోడ్ అతిక్రమిస్తే 9908712421 మొబైల్ కి కాల్ చేయండి
కామారెడ్డి జిల్లాలో జడ్పీటీసీ, ఎంపిటిసీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ అయింది. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. రాజకీయ నాయకుల ఫోటోలు, వాల్ పోస్టర్లను వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే 9908712421 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు.