సుడిగాలి సుధీర్ కొత్త చిత్రం ప్రారంభం
జబర్దస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న ‘హైలెస్సో’ చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్రసన్నకుమార్ కోట దర్శకత్వంలో శివ చెర్రీ, రవికిరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో మైథలాజికల్ టచ్‌తో రానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు