జీఎస్టీ పెంపుతో నష్టం!: ఫిక్కీ

జీఎస్టీ పెంపుతో నష్టం!: ఫిక్కీ

జీఎస్టీ పెంపుతో నష్టం!: ఫిక్కీ

న్యూఢిల్లీ:

చమురు-గ్యాస్, కోల్ బెడ్ మీథేన్ రంగాల్లో ఉపయోగించే యంత్రపరికరాలపై జీఎస్టీని **12% నుంచి 18%**కు పెంచడాన్ని ఫిక్కీ తీవ్రంగా అభ్యంతరం తెలిపింది.

ఈ మేరకు కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరికి లేఖ రాసిన ఫిక్కీ, కొత్త చమురు క్షేత్రాల చట్టంలోని హామీలకు ఇది విఘాతం కలిగిస్తోందని, దేశీయ ఉత్పత్తి లక్ష్యాలు దెబ్బతింటాయని స్పష్టం చేసింది.

జీఎస్టీ పెంపుతో ప్రాజెక్టు వ్యయాలు పెరిగి, పెట్టుబడులు దెబ్బతిని, ఇంధన భద్రతపై ప్రభుత్వ లక్ష్యం సవాళ్లను ఎదుర్కొంటుందని హెచ్చరించింది.

అదే సమయంలో సహజ వాయువును ఇప్పటికీ జీఎస్టీ పరిధిలోకి తీసుకురాకపోవడం పరిశ్రమకు పెద్ద ఇబ్బందిగా మారిందని ఫిక్కీ గుర్తుచేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment