డల్లాస్లో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు
మనోరంజని ప్రతినిధి భైంసా సెప్టెంబర్ 29
నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రానికి చెందిన మాజీ ఎంపీపీ గొట్టుముక్కుల అరుణ రమణరావు కుమార్తెలు మరియు వారి బంధువులు అమెరికా దేశంలోని డల్లాస్ నగరంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. పలువురు పెద్దలు, వృద్దులు మరియు సాంప్రదాయ పట్ల ప్రేమ ఉన్న వ్యక్తులు, ఖండాలు దాటిన ఆచారాలు, సంప్రదాయాలకు అనుగుణంగా ఘనంగా జరగిన బతుకమ్మ సంబరాలను అభినందించారు. ఈ వేడుకల ద్వారా భారతీయ సంప్రదాయాలను, కల్చరల్ ఆచారాలను విదేశీయులకు కూడా పరిచయం చేయడం, భారత దేశం యొక్క సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి ప్రదర్శించడం కుటుంబ సభ్యులు,బంధువులు హర్షం వ్యక్తం చేశారు