పురాతన దత్తాత్రేయ దేవస్థానంలో ఉట్టిపడేలా గాజుల పండుగ

పురాతన దత్తాత్రేయ దేవస్థానంలో ఉట్టిపడేలా గాజుల పండుగ

పురాతన దత్తాత్రేయ దేవస్థానంలో ఉట్టిపడేలా గాజుల పండుగ

మనోరంజని ప్రతినిధి భైంసా సెప్టెంబర్ 28

పురాతన దత్తాత్రేయ దేవస్థానంలో ఉట్టిపడేలా గాజుల పండుగ

పురాతన దత్తాత్రేయ దేవస్థానంలో ఉట్టిపడేలా గాజుల పండుగపురాతన దత్తాత్రేయ దేవస్థానంలో ఉట్టిపడేలా గాజుల పండుగపురాతన దత్తాత్రేయ దేవస్థానంలో ఉట్టిపడేలా గాజుల పండుగ

నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని దెగాం గ్రామంలో గల అతి పురాతన శ్రీ దత్తాత్రేయ ఆలయంలో ఆదివారం మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆడపడుచులు కలిసికట్టుగా గాజుల పండుగను ఘనంగా జరుపుకున్నారు. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా గాజుల పండుగ సాగింది. మహిళలు ఒకరికి ఒకరు గాజులు వేసుకుంటూ ఆనందంలో మునిగిపోయారు. పండుగ సందర్భంగా ఆలయ ప్రాంగణం ఉత్సవ వాతావరణాన్ని సంతరించుకుంది. గాజుల పండుగ ఇప్పుడు గ్రామాల్లో ప్రత్యేకంగా సందడి చేస్తోంది. ఎక్కడ చూసినా ఈ పండుగ జరుపుకుంటూ మహిళలు ఐక్యతను ప్రదర్శిస్తున్నారు. పండుగలు ప్రజల మధ్య అనుబంధాలను మరింత బలపరుస్తాయని పలువురు అభిప్రాయపడ్డారు.ఏది ఏమైనా గాజుల పండుగ పాత స్నేహితురాళ్లను, బంధువులను ఒకచోట చేర్చి ఉత్సవంలా జరుపుకోవడానికి దోహదపడుతుందని గ్రామస్థులు పేర్కొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment