భారీ వర్షానికి దెబ్బతిన్న సోయా పంట

భారీ వర్షానికి దెబ్బతిన్న సోయా పంట

పంట పొలాల్లోనే మొలకెత్తిన గింజలు

ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్న రైతులు

మనోరంజని ప్రత్యేక ప్రతినిధి మాధవరావ్ సూర్య వంశీ సెప్టెంబర్ 28

భారీ వర్షానికి దెబ్బతిన్న సోయా పంట

ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయంలోనే నీటి పాలు కావడం రైతన్నలను కలచివేస్తుంది. ముధోల్ నియోజకవర్గం వ్యాప్తంగా ఆయా మండలాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో సోయా పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. ముధోల్- బాసర -తానూర్- కుబీర్- బైంసా మండలాల్లో అధిక విస్తీర్ణంలో సోయా పంటను రైతులు సాగు చేస్తారు. అధిక తేమ, నిరంతర వర్షాల కారణంగా కోతకు సిద్ధంగా ఉన్న సోయా, మినుము పంట గింజలు పొలాల్లోనే మొలకెత్తాయి. పంట పూర్తిగా దెబ్బతినడంతో కనీసం పెట్టుబడి కూడా దక్కే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నెల రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో రైతన్నకు తీరని నష్టం కలిగింది. గత నెలలోనే కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటల సర్వేలు చేసి అధికారులు నివేదికను పంపారు. అయితే వర్షాలు తగ్గుముఖం పట్టకుండా కురవడంతో పంట పొలాల్లో ఉన్న కాస్త పంట నీళ్లపాలై నష్టాన్ని మిగిలించింది. అప్పులు చేసి వేసిన పంటలు పూర్తిగా దెబ్బ తినడంతో తమ పరిస్థితి దయనీయంగా మారిందని రైతులు వాపోతున్నారు. అదేవిధంగా ఇతర పంటలు సైతం వర్షానికి దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతినిధులు, అధికారులు తక్షణమే స్పందించి పంట నష్టాన్ని అంచనా వేసి ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment