యువత ఆధ్యాత్మిక మార్గంలో పయనం సాగాలి ..
భైంసా టౌన్ సిఐ గోపీనాథ్
మనోరంజని ప్రతినిధి భైంసా సెప్టెంబర్ 28
యువత ఆధ్యాత్మిక, భక్తి మార్గంలో పయనం సాగాలని భైంసా టౌన్ సిఐ గోపీనాథ్ అన్నారు. శనివారం రాత్రి భైంసా పట్టణంలోని గణేష్ నగర్ లో గల శ్రీరామ చైతన్య యూత్ నిర్వాహకులు నిర్వహించిన హారతి కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతన తో మానసిక ప్రశాంతత , ఉత్తేజాన్ని కలిగిస్తోందని అన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని కోరారు. పండుగలను సోదర భావంతో దుర్గామాత నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా చూడాలని సూచించారు. అనంతరం సిఐ ను శ్రీరామ చైతన్య యూత్ ఆధ్వర్యంలో శాలువ తో సత్కరించి, అమ్మవారి ఫొటోను బహుకరించారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు రఘువీర్, తోట రాము, సుధాకర్, దత్తు, తోట విరాట్ , కాలనీ వాసులు పాల్గొన్నారు.