అమ్మవారి ఆభరణాలను ఎత్తుకున్న డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు

అమ్మవారి ఆభరణాలను ఎత్తుకున్న డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు

అమ్మవారి ఆభరణాలను ఎత్తుకున్న డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు

మనోరంజని ప్రతినిధి
సారంగాపూర్, సెప్టెంబర్ 27

అమ్మవారి ఆభరణాలను ఎత్తుకున్న డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని ప్రసిద్ధిగాంచిన అడెల్లి మహా పోచమ్మ గంగ నీళ్ల జాతర శనివారం భక్తిశ్రద్ధలతో ప్రారంభమైంది.

అమ్మవారి ఆభరణాలను ఎత్తుకున్న డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు

ఈ సందర్భంగా ఆలయం నుండి అమ్మవారి ఆభరణాలను సేవాదారులు, భక్తులు కాలినడకన బాజాభజంత్రీలతో న్యూ సాంగ్వి గ్రామానికి తీసుకెళ్లారు. స్థానిక ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావు హాజరై అమ్మవారి నగలకు కొబ్బరికాయలు కొట్టి పూజలు చేసి, స్వయంగా ఆభరణాలను మోసుకుంటూ కొంతదూరం నడిచి గోదావరి వైపు సాగనంపారు.

ముందుగా ఆలయంలో ఆలయ ఛైర్మన్ సింగం భోజగౌడ్, ధర్మకర్తలు, ఈ.ఓ రమేష్ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు శ్రీనివాస్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి గంగ నీళ్ల జాతరను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో పరిసర గ్రామాల అమ్మవారి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విశేష భక్తిశ్రద్ధలు చాటారు.

Join WhatsApp

Join Now

Leave a Comment