సాహిత్య సామ్రాట్ గణేష్మాత మండలి యూత్ ఆధ్వర్యంలో వందమంది మహిళల హారతి
మనోరంజని ప్రతినిధి
భైంసా, సెప్టెంబర్ 27
దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా భైంసా మండలంలోని వాలేగాం గ్రామంలో సాహిత్య సామ్రాట్ గణేష్మాత మండలి యూత్ ఆధ్వర్యంలో దుర్గామాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.
ఉత్సవాల్లో ఆరవ రోజైన ఆదివారం అమ్మవారు శ్రీ కాత్యాయినీ దేవి అవతారంలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని వందమంది ఒకేసారి హారతి ఇచ్చి అమ్మవారిని ఆరాధించారు.
అనంతరం మండపం వద్ద మహిళలు మాట్లాడుతూ – శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవిని తొమ్మిది రోజులు ఆరాధించడం అనేది చెడుపై మంచిది సాధించిన విజయానికి ప్రతీక అని, సాంస్కృతిక ఉత్సవాలతో కూడిన పండుగగా నవరాత్రులు జరుపుకుంటామని పేర్కొన్నారు.