ఆ నలుగురి పాత్రలో మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ సభ్యులు
మనోరంజని ప్రతినిధి, ప్రొద్దుటూరు – సెప్టెంబర్ 27
ప్రొద్దుటూరు ప్రభుత్వ దవాఖానలో వడ్డరపు లక్ష్మీదేవి అనే మహిళ మరణించగా, ఆమెకు బంధువులు ఎవరూ లేకపోవడంతో అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు ఇబ్బంది ఏర్పడింది. ఈ విషయాన్ని ముద్దునూరు పోలీసులు మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ టౌన్ ప్రెసిడెంట్ సుబహాన్‌కి ఫోన్ ద్వారా తెలియజేయగా, ఆయన వెంటనే స్పందించారు.
శనివారం సాయంత్రం ఫౌండేషన్ సభ్యులు కలిసి హిందూ స్మశానవాటికలో సంప్రదాయబద్ధంగా అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఈ సందర్భంలో ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్ రావు, టౌన్ వైస్ ప్రెసిడెంట్ మునీంద్రా, ఈశ్వర్ వర్ధన్ రెడ్డి, కృప ఆగ్ని షారూన్ ట్రస్ట్ సభ్యులు పాపిషెట్టీ వెంకట లక్ష్మమ్మ, సుమన్ బాబు, ప్రసన్న కుమార్, మైఖేల్ బాబు తదితరులు సహకరించారు.
మా శ్రీ అమ్మ శరణాలయం లోని వృద్ధులకు సహాయం చేయదలచిన దాతలు క్రింది నంబర్లను సంప్రదించాలని ఫౌండేషన్ విజ్ఞప్తి చేసింది.
📞 82972 53484, 91822 44150