సర్వం సిద్ధం – వంజర్ గ్రామంలో గంగా పోచమ్మ జాతర
మనోరంజని ప్రతినిధి, సారంగాపూర్ – సెప్టెంబర్ 27
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం వంజర్ గ్రామంలో ఆదివారం అంగరంగ వైభవంగా జరగనున్న గంగా పోచమ్మ జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశముండటంతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని రకాల సౌకర్యాలను సమకూర్చినట్లు వంజర్ మహాలక్ష్మీ ఆలయ కమిటీ సిబ్బంది తెలిపారు.
ప్రతి ఏటా నిర్వహించే ఈ ఘనమైన గంగా పోచమ్మ జాతరకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ల నుండి కూడా వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని, వారందరికీ తగిన సదుపాయాలు సిద్ధం చేసినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.