బిఆర్ఎస్ లో రిటైర్డ్ ప్రొఫెసర్ చేరిక
పార్టీలో ఆహ్వానించిన మాజీ జిల్లా పరిషత్ చైర్మన్
మనోరంజని ప్రతినిధి నిజామాబాద్ సెప్టెంబర్ 26
నిజామాబాద్ పట్టణంలోని బిఆర్ఎస్ కార్యాలయంలో రిటైర్డ్ ప్రొఫెసర్ బి శ్రీనివాస్ రావు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి విట్టల్ రావు సమక్షంలో పార్టీలో చేరారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీలోకి గులాబీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఉద్యమాన్ని ప్రజలు మరవరన్నారు. అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి తో పాటు సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఆయన బాటలో నడుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రమణారావు బి శ్రీనివాస్ రావు నీలం రెడ్డి, అగ్గు సంతోష్, మాకు రవి, న్యాలo రమేష్, బి. చలపతిరావు, షేక్ సాదిక్, కృష్ణ, శేఖర్, తదితరులు పాల్గొన్నారు