చివరి ప్రయాణానికి చేయూతగా నిలిచిన మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్
మనోరంజని ప్రతినిధి, ప్రొద్దుటూరు – సెప్టెంబర్ 26
ప్రొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్‌లో వెంకటయ్య అనే వృద్ధుడు మరణించగా, ముగ్గురు రోజులు గడిచినా ఆయన బంధువులు ఎవరూ రాకపోవడంతో హాస్పిటల్ సిబ్బంది మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ టౌన్ ప్రెసిడెంట్ సుబహాన్‌ను సంప్రదించారు.
సమాచారం అందుకున్న ఫౌండేషన్ సభ్యులు వెంటనే స్పందించి, శుక్రవారం సాయంత్రం హిందూ స్మశానవాటికలో హిందూ సంప్రదాయ ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమానికి చేయూతనిచ్చిన ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్ రావు, టౌన్ వైస్ ప్రెసిడెంట్ మునీంద్ర, ఈశ్వర్, వర్ధన్ రెడ్డి, కృప ఆగ్ని, షారూన్ ట్రస్ట్ సభ్యులు ప్రసన్న కుమార్ తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే శ్రీ అమ్మ శరణాలయంలోని వృద్ధులకు సహాయం చేయదలచిన దాతలు ఈ క్రింది నంబర్లను సంప్రదించవలసిందిగా కోరారు:
📞 82972 53484, 91822 44150