స్వర్ణ గ్రామంలో రైతు అవగాహన సదస్సు
మనోరంజని ప్రతినిధి, సారంగాపూర్ – సెప్టెంబర్ 26
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని స్వర్ణ గ్రామంలో ఇన్సెక్టిసైడ్స్ ఇండియా లిమిటెడ్ ట్రాక్టర్ బ్రాండ్ ఆధ్వర్యంలో రైతు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కంపెనీ ఫీల్డ్ మార్కెటింగ్ మేనేజర్ హంస విజయభాస్కర్, ఏరియా మేనేజర్ నిమ్మగడ్డ హరీష్ హాజరై రైతులకు పత్తి పంటలో వచ్చే చీడపీడలు, తెగుళ్ల నివారణపై విశదీకరించారు.
సదస్సులో చుట్టుపక్కల గ్రామాల రైతులు పాల్గొని సూచనలు స్వీకరించారు. అలాగే కంపెనీ డిస్ట్రిబ్యూటర్లు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఇన్సెక్టిసైడ్స్ ఇండియా లిమిటెడ్ ప్రతినిధులైన సేల్స్ ఎగ్జిక్యూటివ్ గణేష్ రెడ్డి, సీనియర్ సేల్స్ ఆఫీసర్లు మాణిక్యం వెంకటేష్, నర్సింగ్ రెడ్డి పాల్గొన్నారు.