సమ్మక్క సాగర్ ప్రాజెక్టు.. NOC జారీకి ఛత్తీస్‌గఢ్ సీఎం అంగీకారం!
తెలంగాణ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సోమవారం ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్‌ను కలిసి, గోదావరిపై తెలంగాణ చేపట్టిన సమ్మక్క సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి నిరభ్యంతర పత్రం (NOC) జారీ చేయాలని కోరారు. ఛత్తీస్‌గఢ్‌లో ముంపునకు గురయ్యే ప్రాంతానికి పరిహారం, సహాయ, పునరావాస చర్యలు చేపడతామని మంత్రి హామీ ఇచ్చారు. దీనికి ఛత్తీస్‌గఢ్ సీఎం సూత్రప్రాయంగా ఆమోదం తెలపడంతో, మంత్రి ఉత్తమ్ ధన్యవాదాలు తెలిపారు