గ్రామాలలో ఘనంగా దేవి నవరాత్రులు
జనత న్యూస్ సెప్టెంబర్ 22 కుంటాల: మండల కేంద్రంలోని అన్ని గ్రామాలలో దేవి నవరాత్రులు మొదటి రోజు దుర్గమ్మ తల్లి కి ప్రత్యేక పూజలు పండితులు భక్తులు నిర్వహించారు. దుర్గమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో పాడిపంటలు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో మాలాధారణ స్వాములు మాత స్వాములు భక్తులు చిన్నారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు