అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..

అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..

డీజే పాటలతో అలరించిన మహిళలు…

మండల వ్యాప్తంగా బతుకమ్మ పండుగ…

సెప్టెంబర్ 22కుబీర్;కుబీర్ మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాలలో బతుకమ్మ బతుకమ్మల పాటలతో మహిళలు ఓరెత్తిస్తూ ముత్యాలు చేస్తూ. బతుకమ్మను ఊరేగించారు. తెలంగాణలో ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ పండుగ, తెలంగాణ సాంస్కృతి సంప్రదాయాలు గొప్పతనాన్ని తెలియజేస్తూ,
ప్రకృతిలో సూర్యచంద్రులను కొలిచిన విధంగానే వివిధ రకాల పూలను కొలిచే పండుగ మన రాష్ట్రంలో కొనసాగుతోంది. తిరొక్క రంగుల పూలతో బతుకమ్మను పేర్చి గౌరమ్మను పెట్టి భక్తిశ్రద్ధలతో బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ప్రజల కష్టసుఖాలను పాట రూపంలో పాడుతూ బతుకమ్మను కొని ఆడతారు. ఆడబిడ్డలను ఇంటికి పిలుచుకొని కుటుంబమంతా సంబరాలు చేసుకుంటు, బతుకమ్మ ఒక సామాజిక ఉత్సవం. మత, వర్గ, కుల, వృత్తి, ప్రాంత సంప్రదాయాలకు అతీతంగా జరుపుకుంటారు. బతుకమ్మ పండుగ వారసత్వాన్ని ప్రపంచానికి చాటింది. అశ్వయుజ అమావాస్యనాడు ఎంగిలి పూల పేరుతొ ఎంగిలికాని పూలతొ పేర్చిన బతుకమ్మతో మొదలై… తొమ్మిది రోజులు కొనసాగి దుర్గాష్టమి నాడు సద్దుల బతుకమ్మతో పూర్తవుతుంది. ప్రకృతిలో లభించే అన్ని రకాల పూలతో బతుకమ్మను పేర్చి ఆడ మగ వయోభేదం లేకుండా ఈ పండుగలో పాలుపంచుకుంటారు.తెలంగాణలో బతుకమ్మ పండగకు ఉన్నంత ప్రాముఖ్యత మరే పండగకు ఉండదు. ఒక్కోరోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఒక్కోరోజు ఒక్కో బతుకమ్మను పేరుస్తూ.. ఊరూవాడా ఏకమై పండగ చేసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమం గ్రామాల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని వారికి తోడుగా ఆయా గ్రామంలోని పెద్దలు, ప్రజలు, మహిళలు, పిల్లలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment