*శరన్నవరాత్రి వేడుకలకు ఎమ్మెల్యే ను ఆహ్వానించిన వానల్ పహాడ్ గ్రామస్తులు*
మనోరంజని ప్రతినిధి భైంసా సెప్టెంబర్ 22
నిర్మల్ జిల్లా భైంసా మండలం లోని వానల్ పహాడ్ గ్రామం లో చింత చెట్టు కాండం లో స్వయం భుగా గత సంవత్సరం దుర్గమాత వెలియడం తో అప్పటి నుండి శరన్నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.అందులో భాగంగానే ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే నివాసనికి చేరుకొని *ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్* ను ఆహ్వానించారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యే కు కంకణ ధారణ చేశారు..ఈ సందర్భంగా ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. అమ్మ వారు అందరిని చల్లంగా చూడాలని ఆకాంక్షించారు.