నేటి నుంచి అమల్లోకి జీఎస్టీ 2.0
నేటి నుంచి జీఎస్టీ 2.0 అమల్లోకి రానుంది. వంటగది సరుకుల నుంచి ఎలక్ట్రానిక్స్, మందులు, వైద్య పరికరాలు, వాహనాలు, వ్యక్తిగత జీవిత- ఆరోగ్య బీమా పాలసీ ప్రీమియం ధరలు తగ్గనున్నాయి. జీఎస్‌టీ 2.0లో మొత్తం 375 రకాల ఉత్పత్తులపై పన్నురేట్లు తగ్గనున్నాయి. ఎఫ్‌ఎంసీజీ, వాహన, ఎలక్ట్రానిక్స్, డెయిరీ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను సెప్టెంబర్ 22 నుంచి తగ్గిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే