ఏపీలో బంగారు గనుల తవ్వకం షురూ… జొన్నగిరి గని నుంచి ఏటా 750 కిలోల బంగారం ఉత్పత్తి
దేశ బంగారం ఉత్పత్తి మ్యాప్‌లో చేరనున్న ఆంధ్రప్రదేశ్
కర్నూలు జిల్లా జొన్నగిరిలో డెక్కన్ గోల్డ్ మైన్స్ గని సిద్ధం
దేశంలో బంగారం వెలికితీయనున్న తొలి ప్రైవేట్ కంపెనీగా రికార్డు
రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు రాగానే ఉత్పత్తి ప్రారంభం
పసిడి దిగుమతుల భారం తగ్గే అవకాశం
భారతదేశ బంగారం ఉత్పత్తి పటంలో ఆంధ్రప్రదేశ్ త్వరలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోనుంది. కర్నూలు జిల్లాలోని జొన్నగిరిలో డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ (డీజీఎంఎల్) అభివృద్ధి చేసిన గని నుంచి త్వరలోనే పసిడి వెలికితీత ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే దేశంలో గనుల నుంచి బంగారం ఉత్పత్తి చేయనున్న తొలి ప్రైవేట్ రంగ సంస్థగా డెక్కన్ గోల్డ్ మైన్స్ చరిత్ర సృష్టించనుంది