తలుపులు లేని, ఒక్క దొంగతనం కూడా జరగని గ్రామం భారత్లో ఎక్కడుంది?
ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలో గల సియాలియాలో ఏ ఇంటికీ తలుపులుగానీ, ద్వారబంధాలుగానీ ఉండవు.
ఇక్కడ చెక్క ఫ్రేములు, పరదాలు మాత్రమే అడ్డుగా వేసుకుంటారట.
తమ గ్రామ దేవత ఖరాఖైదేవి తమ పూర్వీకులకు కలలో కనిపించి ఏ ఇంటి తలుపులు మూయొద్దని చెప్పిందని, అప్పటి నుంచి తాము ఇదే విధానాన్ని పాటిస్తున్నామని గ్రామస్థులు చెబుతున్నారు.
సియాలియాలో ఇప్పటివరకు ఒక్క చోరీ కేసు కూడా నమోదు కాలేదని స్థానిక పోలీసులు తెలిపారు~