ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకల సంబరాలు
సెప్టెంబర్ 20 కుంటాల: నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. రంగు రంగు పూలతో బతుకమ్మను పేర్చి బతుకమ్మ పాటలు పాడి నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రవేట్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు