నవరాత్రి ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు
బాసర ఆలయ ఈఓ అంజనాదేవి
బాసర మనోరంజని ప్రతినిధి సెప్టెంబర్ 20
దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరలోని జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో శారదియా నవరాత్రి ఉత్సవాలకు విస్తృత ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ ఈవో అంజనాదేవి తెలిపారు. శనివారం ఆలయ ఈవో, ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్ పాటక్, ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈనెల 22 సోమవారం నుండి రెండు అక్టోబర్ వరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తొమ్మిది రోజులపాటు అమ్మవారు తొమ్మిది రూపాలలో భక్తులకు శ్రీ జ్ఞాన సరస్వతమ్మ దర్శనం ఇవ్వానున్నట్లు ఆలయ స్థానాచార్యులు, ప్రధానో అర్చకులు తెలిపారు. తొమ్మిది రోజుల పాటు అమ్మవారి చెంత నా వార్నవా, అర్చన, శ్రీ చక్ర అర్చన పూజ నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈనెల 29న అమ్మవారి జన్మ నక్షత్రం మూల నక్షత్రాన్ని పురస్కరించిన భక్తులు అధిక సంఖ్యలో తరలి రానున్న దృష్ట్యా సాధారణ ప్రత్యేక అక్షరంభ్యాస పూజల క్యూ లైన్ సర్వదర్శన ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మూల నక్షత్రం సందర్భంగా భక్తులకు చిన్నారులకు ఉచితంగా పాలు, బిస్కెట్లు, అరటిపండు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. దేవి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయంతో పాటు ఇతర ఆలయాలను విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరిస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా భక్తులకు ప్రత్యేక క్యూ లైన్ లో తాగునీరు అందించనునట్లు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో వైద్య శిబిరం బయో టాయిలెట్లు అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. దేవీ నవరాత్రి ఉత్సవాల కొరకు వచ్చే భక్తులకు సాంస్కృతి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గోదావరి నది తీరం వద్ద పుణ్య స్నానాలను ఆచరించే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలుగా గజ ఈతగాలను అందుబాటులో ఉంచుతామన్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో ఆలయ ఏఈఓ సుదర్శన్ గౌడ్, సూపరింటెండెంట్ శివరాజ్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.