ఘనంగా జోగులాంబ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు
ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులకు ఆహ్వానం
ఆలంపూర్: దసరా పండుగను పురస్కరించుకొని శ్రీశ్రీశ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి, పశుసంవర్ధక శాఖ మంత్రి శ్రీహరి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య, ప్రభుత్వ సలహాదారు మాజీ మంత్రి జిల్లెల చిన్నారెడ్డి లకు శాలువా కప్పి ఆహ్వానం అందజేశారు.
వారిని ఆహ్వానించిన వారిలో ఆలంపూర్ మాజీ శాసనసభ్యులు, ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ ఎస్.ఏ. సంపత్ కుమార్, శ్రీశ్రీశ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవాలయ కమిటీ చైర్మన్ కొంకల శ్రీ నాగేశ్వర్ రెడ్డి, దేవాలయ కార్యనిర్వాహణ అధికారి దీప్తి, దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.