అమ్మవారి సన్నిధిలో టిఎఫ్డిసి చైర్మన్ దీల్ రాజు
బాసర మనోరంజని ప్రతినిధి సెప్టెంబర్ 19
దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో శుక్రవారం తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్ణకుంభంతో స్వాగతించారు. ఆలయ అర్చకులు వేద పండితులు అమ్మవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందించి శాలువతో సత్కరించారు. ఆయన వెంట ఆలయ అధికారులు, సిబ్బంది, తదితరులు ఉన్నారు.