బాసర అమ్మవారి ఆలయంలో ఆర్జిఎన్ హ్యూమన్ రైట్స్ సంస్థ ఆధ్వర్యంలో పూజలు

బాసర అమ్మవారి ఆలయంలో ఆర్జిఎన్ హ్యూమన్ రైట్స్ సంస్థ ఆధ్వర్యంలో పూజలు

మనోరంజని ప్రతినిధి | బాసర | సెప్టెంబర్ 19

బాసర అమ్మవారి ఆలయంలో ఆర్జిఎన్ హ్యూమన్ రైట్స్ సంస్థ ఆధ్వర్యంలో పూజలు

పుణ్యక్షేత్రం బాసర శ్రీ సరస్వతీ దేవి ఆలయంలో శుక్రవారం ఆర్జిఎన్ హ్యూమన్ రైట్స్ & అవినీతి నిరోధక సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంస్థ చైర్మన్ ఆదేశాల మేరకు అమ్మవారికి చీర సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
బాసర అమ్మవారి ఆలయంలో ఆర్జిఎన్ హ్యూమన్ రైట్స్ సంస్థ ఆధ్వర్యంలో పూజలు

తరువాత రాష్ట్ర అధ్యక్షులు సూర్యవంశీ మాధవరావు పటేల్ నేతృత్వంలోని బృందం ఆలయ ఈఓ అంజనీ దేవిని మర్యాద పూర్వకంగా కలిసింది. రాబోయే దసరా నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్ల గురించి ఆరా తీసి, భక్తుల సౌకర్యార్థం అన్ని విధాల ఏర్పాట్లు జరుగుతున్నాయని ఈఓ వివరించారు. ఉత్సవాల విజయవంతం కోసం అందరూ సహకరించాలని పటేల్ విజ్ఞప్తి చేశారు.
బాసర అమ్మవారి ఆలయంలో ఆర్జిఎన్ హ్యూమన్ రైట్స్ సంస్థ ఆధ్వర్యంలో పూజలు

ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా అధ్యక్షులు కదం నాగేందర్ పటేల్ మాట్లాడుతూ, “ఉత్సవాల్లో మా సంస్థ సభ్యులు పూర్తిగా అండగా ఉంటారు” అని తెలిపారు. అనంతరం ఆలయ చైర్మన్ శరత్ పాఠక్‌ను మర్యాద పూర్వకంగా కలిసి, శాలువాతో సన్మానించారు.

కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జల్లా హన్మండ్లు, జిల్లా సోషల్ మీడియా ఇన్‌చార్జి సింగారం లక్ష్మణ్, భైంసా పట్టణ అధ్యక్షులు సుంకేట శ్రీనివాస్ (గడ్డం)తో పాటు సంస్థ సభ్యులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment