క్యాన్సర్ బాధిత స్నేహితునికి రూ 5,11,000ల సాయం అందించిన పూర్వ స్నేహితులు
– సరస్వతి విద్యా నిలయం 1985 86 పూర్వ విద్యార్థుల దాతృత్వం
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సరస్వతి విద్యా నిలయం 1985 – 86 బ్యాచ్ పూర్వ విద్యార్థులు క్యాన్సర్ తో బాధపడుతున్న మిత్రుడికి అండగా నిలిచి సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చారు. 40 సంవత్సరాల తర్వాత ఇటీవల కలుసుకున్న ఆనాటి పూర్వ విద్యార్థులంతా ఆనందంగా ఆడి పాడి ఉత్సాహంగా గడిపారు. అంతలోనే తమ స్నేహితుడు బోనగిరి శ్రీనివాస్ కష్టాల్లో ఉన్నాడని క్యాన్సర్ తో సంవత్సరకాలంగా బాధపడుతున్నాడని తెలుసుకొన్నారు. విషయం వారి దృష్టికి వచ్చిన మూడు రోజుల్లోనే ఇండియాతో పాటు అమెరికాలో స్థిరపడిన స్నేహితులంతా కలసి బాధిత స్నేహితుడికి అండగా నిలిచేందుకు రూ 5,11, 000 ల ఆర్థిక సహాయాన్ని అందజేసి తమ దాతృత్వం చాటుకున్నారు. స్నేహితుని కలసి పరామర్శించి ఆర్థిక సహాయం అందించి త్వరగా కోలుకోవాలని ఇంకా తమ వంతు సహాయం ఏదైనా చేస్తామని ధైర్యం చెప్పి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మిత్రులు జి. రమేష్, ఏ. అంజు, ఏ. కృపాకర్, జి. కేశవ్, కె. సురేందర్ రెడ్డి, వి. భరద్వాజ్. NPP. సురేష్, P. శ్రీనివాస్, కెనావ్. ప్రకాష్,కె. శ్రీనివాస్,T. రమేష్, జి. వీరాస్వామి, V. శ్రీనివాస్, R. రఘు, T. రామకృష్ణ, T. శ్యామ్ ప్రసాద్, N. రవిచంద్ర, జి. సురేషరెడ్డి, రాజశేఖర్, ఎం. అనిత, కె. నీవేధిత, వి. పద్మ, జి. సవిత, రమాదేవి, కవిత, శ్రీలత, శోభ, సుచరిత. శుభ, NRI మిత్రులు ch. రమేష్,V. జగన్, P. శ్రీనివాస్, P.వెంకటరమణారెడ్డి, V. శ్రీకాంత్, T. సునీత లు ఉన్నారు