గజలమ్మ దేవి ఆలయంలో భక్తుల సందడి
కుంటాల మనోరంజని ప్రతినిధి సెప్టెంబర్ 14
కుంటాల మండల కేంద్రంలోని గజలమ్మ దేవి ఆలయంలో ఆదివారం భక్తులు భారీ సంఖ్యలో తల్లి రావడంతో సందడి నెలకొంది. చుట్టుపక్క ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు గజలమ్మ దేవి పూజలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు ఉదయం నుండి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి అరాధనలు నిర్వహించారు. అనంతరం మంగళహారతినిచ్చి, భక్తులను తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో తల్లి రావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది