ఉత్తమ ఉపాధ్యాయునిగా ప్రకాష్ పటేల్

ఉత్తమ ఉపాధ్యాయునిగా ప్రకాష్ పటేల్

ఉత్తమ ఉపాధ్యాయునిగా ప్రకాష్ పటేల్

బైంసా మనోరంజన్ ప్రతినిధి సెప్టెంబర్ 13

భైంసా పట్టణంలోని సంస్కార్ పాఠశాల కరస్పాండెంట్ పర్వజి ప్రకాష్ పటేల్ ఆనందిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉత్తమ ఉపాధ్యాయులు-2025వ సంవత్సరానికి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని పొందడం జరిగింది. ఈ సందర్భంగా ఆనందిత ఫౌండేషన్ చైర్మన్ వాడేకార్ లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రకాష్ పటేల్ తన బోధన పటిమతో విద్యార్థులలో అభ్యాసన సామర్ధ్యాలను పెంపొందించడమే కాకుండా పాఠశాలలో విద్యా ప్రమాణాలను పెంచే విధంగా కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి సుభాష్, భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ సిందే ఆనంద్ రావు పటేల్, పిఆర్టియు నాయకులు రమణారావు, ప్రధానోపాధ్యాయులు రాచేవాడ్ గంగా ప్రసాద్, లయన్స్ క్లబ్ సభ్యులు మోహన్ రావు, తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment