కాంగ్రెస్ ప్రభుత్వం- నాయకులను విమర్శిస్తే ఊరుకునేది లేదు
బైంసా మనోరంజని ప్రతినిధి సెప్టెంబర్ 13
బాసరలో తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అతి భారీ వర్షాల వలన నష్టపోయి దెబ్బతిన్న పంటలను పరిశీలించడానికి వచ్చారు. జిల్లా ఇన్చార్జి మంత్రితోపాటు మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి-మాజీ శాసనసభ్యులు జి. విట్టల్ రెడ్డి ఉన్నారు. కొందరు బిజెపి నాయకులు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ని గత పది సంవత్సరాలు మీరు ఏమి చేశారో అని అడుగుతున్నారని భైంసా పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. మాజీ మంత్రి తో పాటు ముధోల్ మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గాల అభివృద్ధికి ఏం చేశారన్నది ప్రజలకు తెలుసు అన్నారు. నిర్మల్ జిల్లా చేసిన ఘనత మాజీ మంత్రి ఐకే రెడ్డికి దక్కుతుంది. నిర్మల్ జిల్లాలో మొత్తం 300 పైన దేవాలయాలు మాజీ మంత్రి హయాంలో కావటం జరిగింది. ముధోల్ నియోజకవర్గం లో 100 దేవాలయాలకు పైగా నిర్మించుకున్నాం. మా నాయకులు మంజూరు చేసిన వాటికి ఇప్పుడు వెళ్లి మీరు కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ప్రజలు అంత గమనిస్తారని పేర్కొన్నారు. ఎలక్షన్లో గెలవడానికి ఇచ్చిన 21 హామీల మేనిఫెస్టో మీకు గుర్తుందా అని ప్రశ్నించారు. కుబీర్ మండలంలో పల్సి ని మండల చేస్తా అని బాండ్ పేపర్ మీద సంతకం పెట్టారని, ఆ విషయం అప్పుడే మర్చిపోయారా, ముధోల్ మార్కెట్ యార్డ్ ని చేస్తానన్నారు. అది గుర్తుందా మీరు ఇచ్చిన ఇరవై ఒక్క హామీల మేనిఫెస్టో ప్రజలందరికీ గుర్తుందని తెలిపారు. బాసర అమ్మవారి దేవాలయం అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి కలవడం జరిగిందని సుమారు 160 కోట్ల రూపాయలతో ఇప్పుడు వస్తున్న పుష్కరాల పనులు కూడా కలుపుకొని దేవాలయాభివృద్ధి పనులు ఇప్పటివరకు కానీ పనులు చేద్దామని, మాస్టర్ ప్లాన్ కూడా తయారు అవుతున్నవి, త్వరలోనే ప్రజలకు శుభవార్త తెలియజేస్తా అని అన్నారు. ఏమైనా అంటే పార్టీ మారారు అని అంటున్నారు. మీరు ఎలా అయితే మీ కార్యకర్తల ఇష్టం కోసం పార్టీ మారారు. నాయకుడు కూడా మా కార్యకర్తల అభిష్టం కొరకే పార్టీ మారారని తెలిపారు. పార్టీ మారిన ఎప్పుడు ప్రజల మధ్యలోనే ఉన్నారు. మీలాగా వాళ్లకు ఫ్యాక్టరీలు, వ్యాపారాలు లేవని పేర్కొన్నారు. వ్యక్తిగతంగా విమర్శించడం మానుకొని అభివృద్ధి పైన దృష్టి పెట్టండని హితం పలికారు. కేంద్రంలో మంత్రులు ఉన్న ప్రసాద్ అనే పథకం ద్వారా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవాలయానికి నిధులు ఎందుకు తేలేకపోతున్నారని ప్రశ్నించారు. కేంద్ర విశ్వవిద్యాలయం కోసం గతంలో మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి ఉన్నప్పుడే స్థల పరిశీలన చేయడం జరిగింది. ఇప్పటివరకు దానిపై ఊసే లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఇంత భారీగా వరదలు వచ్చినా కనీసం ప్రధానమంత్రి ఇటు వైపు మొఖం కూడా చూడలేదు. అదే బిజెపి పాలిత రాష్ట్రాలలో వెళ్లి వెంటనే నిధులు మంజూరు చేశారు. వరద సాయం మంజూరులో వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. తెలంగాణ రైతాంగం అంటే ఇంత చిన్నచూపు ఇక్కడ 8మంది ఎంపీలను గెలిపించినందుక అని పేర్కొన్నారు. ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీని గానీ మా నాయకులు గాని విమర్శిస్తే ఊరుకోమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కుబీర్ మార్కెట్ చైర్మన్ గోనెలు కళ్యాణ్, బైంసా ఏఎంసి వైస్ చైర్మన్ ఎండి ఫారూక్ అహ్మద్, మాజీ జడ్పిటిసిలు రాజన్న, బుచ్చన్న, మాజీ ఆత్మ చైర్మన్ పోతరెడ్డి, మాజీ కో-ఆప్షన్ సభ్యులు గజానంద్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దీక్షిత్, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు