మాజీ మంత్రికి బాసర అభివృద్ధిపై మాట్లాడే అర్హత లేదు
బిజెపి జిల్లా నాయకుడు చిన్నారెడ్డి
బైంసా మనోరంజని ప్రతినిధి సెప్టెంబర్ 11
మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిన్న మంత్రి జూపల్లి వెంట బాసరకు వచ్చారని, ఆయనకు బాసర అభివృద్ధిపై మాట్లాడే అర్హత లేదని బిజెపి జిల్లా నాయకులు చిన్నారెడ్డి అన్నారు. బిజెపి మండలాల అధ్యక్షులు సాయినాథ్ పటేల్, నవీన్, సిరం సుష్మా రెడ్డి, లక్ష్మారెడ్డి, బైంసా పట్టణ అధ్యక్షులు రావుల రాముతో కలిసి గురువారం బైంసా లోని ఎస్ ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. గత పది సంవత్సరాలుగా దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డిలు బాసర అభివృద్ధికి చేసింది ఏమి లేదన్నారు. నిర్మల్ నియోజకవర్గంలో అడెల్లి ఆలయాన్ని అభివృద్ధి చేసి భారతదేశంలో ఉన్న ఏకైక సరస్వతీ మాత ఆలయాన్ని అభివృద్ధి చేయకపోవడం సిగ్గుచేటన్నారు. గతంలో కేటాయించిన 50 కోట్ల రూపాయల నిధులను ఎందుకు ఖర్చు చేయలేదని ప్రశ్నించారు. పదేళ్లపాటు ప్రభుత్వంలో ఉండి చేయలేనివారు అధికారం కోసం కాంగ్రెస్ పార్టీలో చేరి మంత్రి వెంట తిరిగి అధికార దర్పం ప్రదర్శించడానికి మళ్లీ ప్రయత్నిస్తే ముధోల్ నియోజకవర్గ ప్రజలు ఊరుకోరన్నారు. అభివృద్ధిపై పట్టింపులేని నాయకులకు నియోజకవర్గంలో తిరిగి అర్హత లేదన్నారు. ఆలయ అభివృద్ధి కి నిధులు మంజూరు చేయకపోతే అడుగడుగునా అడ్డుకుంటామన్నారు. బాసర కు జరిగిన అన్యాయం పై అసెంబ్లీలో ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ అసెంబ్లీ లో పలుమార్లు వివరించడం జరిగిందన్నారు. దేవాదయ శాఖ మంత్రి కొండా సురేఖ సమక్షంలో ఆలయానికి నిధులు ఇవ్వక పోతే బిక్షాటన చేసైనా మా ఆలయాన్ని అభివృద్ధి చేసుకుంటామని ఎమ్మెల్యే రామరావ్ పటేల్ ప్రభుత్వానికి దసరా వరకు డెడ్ లైన్ విధించడం జరిగిందన్నారు.. ఇకనైనా మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తన తీరు మార్చు కోవాలన్నారు. బాసర ఆలయ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పటేల్ నాయకత్వం లో పోరాట బాట పడుతామన్నారు