సేవకే ప్రతీకగా నిలిచిన మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్
మనోరంజని ప్రతినిధి, ప్రొద్దుటూరు | సెప్టెంబర్ 11
ప్రొద్దుటూరు రామేశ్వరం ప్రాంతంలో గడ్డం వెంకటేశ్వర్లు అనే వ్యక్తి అనుకోని విధంగా మరణించారు. కుటుంబ సభ్యులు లేకపోవడంతో, ఆయనకు తగిన అంతిమ సంస్కరణలు చేయడానికీ భౌతిక సాయం అందక పడ్డారు. ఈ సమయంలో స్థానికులు మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ టౌన్ ప్రెసిడెంట్ సుబహాన్ ను సంప్రదించగా, వారు వెంటనే స్పందించి హిందూ సంప్రదానం ప్రకారం శ్రీ రామేశ్వరం హిందూ స్మశాన వాటికలో గౌరవపూర్వకంగా అంతిమ సంస్కరణలు నిర్వహించారు.ఈ మహత్తర సేవ కార్యక్రమానికి మోరే లక్ష్మణ్ రావు (ఫౌండేషన్ చైర్మన్), సుబహాన్ (టౌన్ ప్రెసిడెంట్), వైస్ ప్రెసిడెంట్ మునీంద్రా, అహమ్మద్ హుస్సేన్, కుళాయి రెడ్డి, కృప ఆగ్ని షారూన్ ట్రస్ట్ సభ్యులు పాపిషెట్టి వెంకటాలక్షుమ్మ, సుమన్ బాబు, సురేష్ మరియు ఇతర సభ్యులు ముందుకొచ్చి సేవ చేశారు. మా శ్రీ అమ్మ శరణాలయం వృద్దుల సహాయం కోసం మరియు మరిన్ని సేవ కార్యక్రమాలకు దాతలు కావాలని మనఃపూర్వకంగా కోరుకుంటున్నాము.
📞 సాయం అందించడానికి సంప్రదించాల్సిన నంబర్లు:
📱 82972 53484
📱 9182244150
మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ – సేవకు నిత్య ప్రతీక