పోలింగ్ స్టేషన్ల ముసాయిదా ప్రచురణ

పోలింగ్ స్టేషన్ల ముసాయిదా ప్రచురణ

పోలింగ్ స్టేషన్ల ముసాయిదా ప్రచురణ

ముధోల్ మనోరంజని ప్రతినిధి సెప్టెంబర్ 6

మండల కేంద్రమైన ముధోల్లోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 2025 ముసాయిదా జాబితాను ఎంపీడీవో శివకుమార్ విడుదల చేశారు. ఎంపీటీసీ-జడ్పిటిసి ముసాయిదా ఓటర్ల జాబితా పోలింగ్ స్టేషన్ల జాబితాను ప్రచురించారు. ఈనెల 8న మండల స్థాయిలో రాజకీయ పార్టీలతో సమావేశాన్ని నిర్వహిస్తారు. ఆరవ తేదీ నుంచి 8వ తేదీ వరకు ముసాయిదాపై అభ్యంతరాలను ఇతర సమస్యలపై దరఖాస్తులను స్వీకరిస్తారు. వచ్చిన ఫిర్యాదులను 9వ తేదీన పరిష్కరించి పదవ తేదీన తుది ఓటర్ల జాబితా పోలింగ్ స్టేషన్లు జాబితాను ప్రకటించనున్నారు. ఈ కార్యక్రమంలో యూడిసి నాజీముద్దీన్, జూనియర్ అసిస్టెంట్లు, పంచాయితీ కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment