శ్రీ గణేష్ మండలి వద్ద అన్నదానం.
మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ సెప్టెంబర్ 06
నిర్మల్ జిల్లా, సారంగాపూర్: మండలకేంద్రంలో భూలక్ష్మీ నగర్ లోని శ్రీ గణేష్ యువజన సంఘం ఆధ్వర్యంలో శనివారం శ్రీ గణేష్ మండలి మండపంలో ప్రతిష్టించిన వినాయకున్ని పదకొండవ రోజు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. తీర్థ ప్రసాదాలు వితరణ అనంతరం అన్నదానం చేపట్టారు.కాలనీవాసులు పెద్దయెత్తున పాల్గొన్నారు.