గణనాథుడు నిమజ్జనం ప్రశాంతంగా జరుపుకోవాలి
భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్
గణనాథుడు నిమజ్జనం ప్రశాంతంగా జరుపుకోవాలని భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ అన్నారు. శుక్రవారం రాత్రి భైంసా మండలం లోని మాంజ్రి గ్రామంలో గణనాథుడు హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఎస్పీని భైంసా మార్కెట్ కమిటీ ఛైర్మన్ శిందే ఆనందరావు పటేల్ శాలువ తో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్జిఎన్ హ్యూమన్ రైట్స్ అవినీతి నిరోధక సంఘం ముధోల్ తాలూకా అధ్యక్షులు కదం నాగేందర్ పటేల్, బాపురావు పటేల్. సురేష్ పటేల్ రమేష్ కౌడేకర్ గంగాధర్.గంగాధర్. అజయ్. నవీన్. సిడబోయిన మాధవ్. దిగాంబర్ , యూత్ సభ్యులు, గ్రామస్తులు, గ్రామ పెద్దలు, గణేష్ మండపం నిర్వాహకులు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.