విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో మహా లడ్డు ప్రసాదం పొందిన- న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్.
సంగారెడ్డి జిల్లా, సదాశివపేట పట్టణంలో హనుమాన్ నగర్ కాలనీలో హనుమాన్ దేవాలయంలో భక్తిశ్రద్ధలతో గత కొన్ని సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం విఘ్నేశ్వరుని విగ్రహాన్ని వినాయక చవితి సందర్భంగా ప్రతిష్టాపించి నిత్యం భజన భజంత్రీలతో 11 రోజులపాటు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి విఘ్నేశ్వరుడిని ఆరాధిస్తారు. ఈ యొక్క వేడుకలలో 9వ దినము రోజున జరిపే పూజ వేడుకలలో న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ పాల్గొని ఆ యొక్క మహాగణపతి విఘ్నేశ్వరుడు యొక్క ఆశీర్వాదం పొంది, విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో ఆలయ పూజారి శివకోటి పంతులు గారిచే శాలువాతో ఘనంగా సత్కరించి ఆ విఘ్నేశ్వరుడు యొక్క మహా లడ్డు ప్రసాదాన్ని న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ పొందారు. ఇట్టి సందర్భంలో న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ భక్తిశ్రద్ధలతో మహాగణపతి విగ్నేశ్వరుడి లడ్డు ప్రసాదం ఆ విగ్నేశ్వరుడు యొక్క ఆశీర్వాదంతో, అనుగ్రహం తోనే పొందడం,స్వీకరించడం ఎంతో ఆనందదాయకమని విఘ్నేశ్వరుడి ఆశీస్సులు, అనుగ్రహం ఉంటే చేపట్టే ప్రతి కార్యము విజయపతమేనని విఘ్నేశ్వరుడిని వేడుకున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో ఆలయ కమిటీ వారు కొల్కూరి ప్రవీణ్, ఈశ్వరయ్య, వీరేశం, సంగమేశ్వర్, కృష్ణారెడ్డి, మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.