పోచమ్మ దుకాణాల సముదాయనికి వేలం.
మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ సెప్టెంబర్ 05
నిర్మల్ జిల్లా, సారంగాపూర్: మండలంలో ప్రసిద్ధి గాంచిన అడెల్లి శ్రీ మహా పోచమ్మ ఆలయం వద్ద శనివారం వివిధ దుకాణాల సముదాయానికి బహిరంగ వేలం పాట నిర్వహిస్తున్నట్లు ఆలయ ఛైర్మెన్ సింగం భోజాగౌడ,ఆలయ ఈఓ రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. బహిరంగ వేలములు (1) కొబ్బరికాయలు అమ్ముకునే హక్కు (2) ప్యాలాలు, పుట్నాలు అమ్ముకునే హక్కు (3) బొమ్మలు, కంకణాలు, సిడిలు, ఫోటోలు అమ్ముకునే హక్కు (4) టోల్ టెక్స్ వసూలు చేసుకునే హక్కు కాలపరిమితి తేదీ.07 సెప్టెంబర్ 2025 నుండి 06 సెప్టెంబర్ 2026 వరకు ఉంటుందన్నారు. ఆసక్తి కలవారు. శనివారము ఉదయం 11.00 గం॥లకు బహిరంగ వేలం పాట పాల్గొనగలరు. ఇతర వివరములకు దేవస్థాన కార్యాలయములో సంప్రదించగలరు