ఘనంగాఉపాధ్యాయ దినోత్సవం
మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ సెప్టెంబర్ 05 .
నిర్మల్ జిల్లా, సారంగాపూర్ :మండల కేంద్రంలోని వివేకానంద హై స్కూల్ లో డా. సర్వేపెల్లి రాధకృష్ణన్ గారి పుట్టిన రోజు సందర్భంగా పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల గొప్పదనం గురించి విద్యార్థులు తెలియజేసారు. విద్యార్థులు ఉపాధ్యాయుల వేషాదరణలో ఆట పాటలతో అలరిస్తూ ఆకట్టుకున్నారు. ఇందులో పాఠశాల కరస్పాండెంట్ సముద్రాల గీత, ప్రిన్సిపాల్ కాకూస్తం విమల మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.