మంత్రి సీతక్క ఎమ్మెల్యేల జోలికొస్తే సహించేది లేదు
ఆదివాసి కాంగ్రెస్ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద నాయక్
మనోరంజని ప్రతినిధి | ఖానాపూర్ | సెప్టెంబర్ 05
రాష్ట్ర మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ జోలికొస్తే సహించేది లేదని ఆదివాసి కాంగ్రెస్ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద నాయక్ హెచ్చరించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఇటీవల సీతక్కతో పాటు పినపాక, భద్రాచలం ఎమ్మెల్యేలు కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసారని, ఉట్నూర్, భద్రాచలం ఐటిడిఏలకు సంబంధించిన బిఈడ్ కాలేజ్ స్టాఫ్ భర్తీ, ఇందిరమ్మ ఇండ్ల భవన సౌకర్యాలకు అదనపు నిధుల కేటాయింపు వంటి అంశాలపై విజ్ఞప్తి చేశారని తెలిపారు. అయితే, ఈ విషయాలను పక్కన పెట్టి మంత్రి సీతక్క, ఎమ్మెల్యే వెడమ బొజ్జు పై తప్పుడు ప్రచారం చేయడం, బంజారాలను ఎస్టీ నుంచి తొలగించాలనే ఫేక్ ఫోటోలు పంచడం దురుద్దేశపూర్వక రాజకీయ కుట్ర అని విమర్శించారు.దీనికి వెనుక ఆర్ఎస్ఎస్, బిజెపి, బిఆర్ఎస్ కుట్రలు ఉన్నాయని, వారి ఏజెంట్లకు డబ్బులు ఇచ్చి దుష్ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. ఆదివాసీల మధ్య విభజన సృష్టించే ప్రయత్నాలు విఫలమవుతాయని, ఇటువంటి కుట్రలను తిప్పికొడతామని బాణావత్ గోవింద నాయక్ స్పష్టం చేశారు.
—