గణేష్ నిమజ్జనం పురస్కరించుకొని భగవద్గీత పుస్తకాల పంపిణీ

గణేష్ నిమజ్జనం పురస్కరించుకొని భగవద్గీత పుస్తకాల పంపిణీ

గణేష్ నిమజ్జనం పురస్కరించుకొని భగవద్గీత పుస్తకాల పంపిణీ

నిజామాబాద్ మనోరంజిని ప్రతినిధి సెప్టెంబర్ 4

గణేష్ నవరాత్రుల ఉత్సవాల సందర్భంలో మంచాల శంకరయ్య టేబుల్ ట్రస్ట్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. గణేష్ నిమజ్జనం సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ మంచాల జ్ఞానేందర్ భక్తులకు భగవద్గీత పుస్తకాలు అందజేశారు. భక్తి మార్గంలో సత్యం, ధర్మం, కర్మ మార్గం, ఆధ్యాత్మికతను చాటి చెప్పే గ్రంథాన్ని అందుకోవడం భక్తులకు విశేష ఆనందాన్ని కలిగించింది. ఈ సందర్భంగా భక్తులు ట్రస్ట్ చైర్మన్ జ్ఞానేందర్‌ను శాలువాతో సత్కరించి, కృతజ్ఞతలు తెలిపారు. జ్ఞానేందర్ మాట్లాడుతూ, గణేష్ నవరాత్రులు కేవలం ఉత్సవాలకే పరిమితం కాకుండా, ప్రతి ఒక్కరి జీవితంలో ధార్మిక విలువలు, ఆధ్యాత్మిక ఆచరణలు కొనసాగాలని ఆకాంక్షించారు. భగవద్గీతలోని సూత్రాలు యువతకు మార్గదర్శకంగా నిలుస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, భక్తులు, స్థానిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment