అడెల్లి పోచమ్మ దేవాలయ ప్రారంభోత్సవానికి TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు ఆహ్వానం
మనోరంజని ప్రతినిధి, హైదరాబాద్ | సెప్టెంబర్ 4
నిర్మల్ జిల్లా కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ని నూతనంగా నిర్మించిన అడెల్లి పోచమ్మ దేవాలయం ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు.
బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ జడ్పిటిసి ఫోరం అధ్యక్షులు పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, దేవస్థాన కమిటీ చైర్మన్ సింగం భోజ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దశరథ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
సారంగాపూర్ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అడెల్లి పోచమ్మ దేవాలయం పునర్నిర్మాణం అప్పటి దేవదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభమై, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో పూర్తి అయింది.
ఈ సందర్భంగా ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీర శ్యామ్ నాయక్, పాడి పారిశ్రామిక మాజీ చైర్మన్ లోక భూమారెడ్డి, మాజీ చైర్మన్ అయిర నారాయణ రెడ్డి, టెంపుల్ డైరెక్టర్ ప్రభాకర్ గౌడ్, మండల నాయకులు రాజేశ్వర్ రావు, ఉట్ల రాజేశ్వర్, సత్యం, లక్ష్మణు తదితరులు హాజరయ్యారు.