విద్యార్థులు, ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఈ జిల్లాల్లో హాలిడే డిక్లేర్, CS ఉత్తర్వులు జారీ..!!

విద్యార్థులు, ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఈ జిల్లాల్లో హాలిడే డిక్లేర్, CS ఉత్తర్వులు జారీ..!!

విద్యార్థులు, ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఈ జిల్లాల్లో హాలిడే డిక్లేర్, CS ఉత్తర్వులు జారీ..!!

విద్యార్థులు, ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. వినాయక చవితి వేడుకల ముగింపు సందర్భంగా నిర్వహించే గణేశ్ నిమజ్జనం దృష్ట్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ నెల 6వ తేదీన (శనివారం) సెలవు ప్రకటించింది. అయితే ఈ సెలవు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు వర్తించదు. కేవలం హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల పరిధిలో మాత్రమే సెలవు ఉండనుంది. ఈ జిల్లాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజీలకు సాధారణ సెలవు దినంగా ప్రకటించింది.

ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి సంవత్సరం గణేశ్ నిమజ్జనానికి భారీగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున, ట్రాఫిక్ ఇబ్బందులు, ఇతర భద్రతా కారణాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. నిమజ్జనం ప్రధానంగా హుస్సేన్ సాగర్, ఇతర చెరువుల వద్ద జరగనుంది. ఈ సెలవు వల్ల ఉద్యోగులు, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశం లభిస్తుంది. సాధారణంగా గణేశ్ నిమజ్జనం జరిగే రోజున నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. ఈ సెలవు కారణంగా ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు ప్రయాణ ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ నేపథ్యంలో వారికి ఇబ్బందలు కలగొద్దనే ఉద్దేశ్యంతో పైన పేర్కొన్న జిల్లాల పరిధిలోని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో యథావిధిగా కార్యకలాపాలు కొనసాగుతాయి.

వరుసగా మాడ్రోజుల సెలవు..
ఇక ఆయా జిల్లాల పరిధిలోని విద్యార్థులకు, ఉద్యోగులకు మరో గుడ్‌న్యూస్ ఏంటంటే వరుసగా మాడ్రోజుల సెలవులు రానున్నాయి. సెప్టెంబర్ 5 శుక్రవారం రోజున ముస్లింల పవిత్ర దినం మిలాద్-ఉన్-నబీ మహ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా తెలంగాణ సర్కార్ ఇప్పటికే సెలవు దినంగా ప్రకటించింది. సెప్టెంబర్ 6న శనివారం గణేష్ నిమజ్జనాల సందర్భంగా మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో సెలవు ప్రకటించారు. ఆ తర్వాత రోజు సెప్టెంబర్ 7న ఆదివారం వస్తోంది. దీంతో ఆయా జిల్లాల్లో వరుసగా మాడ్రోజులు సెలవులు వచ్చినట్లు అయింది. ఈ జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్, కాలేజీ విద్యార్థులకు, ప్రభుత్వ ఉద్యోగులకు ఇది నిజంగా తీపి కబురే. ఈ మేరకు వీకెంట్ టూర్ ఫ్లాన్ చేసుకునేందుకు అవకాశం దక్కింది

Join WhatsApp

Join Now

Leave a Comment