ఖైరతాబాద్ గణేశుని దర్శించుకున్న మంచాల జ్ఞానేందర్ దంపతులు
మనోరంజని ప్రతినిధి సెప్టెంబర్ 03
హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవంను సందర్శించేందుకు ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. ఈ సందర్భంగా మంచాల శంకరయ్య చారిటబుల్ ట్రస్ట్, శ్రీ వారాహి దేవాలయం చైర్మన్ మంచాల జ్ఞానేందర్ దంపతులు మంగళవారం ఖైరతాబాద్ గణేశుని దర్శించుకున్నారు. ప్రతీ ఏటా ప్రత్యేకంగా ప్రతిష్టించే ఖైరతాబాద్ గణేశుడి విగ్రహం అద్భుతమైన కళాఖండం అని, భక్తుల విశ్వాసానికి ప్రతీక అని జ్ఞానేందర్ దంపతులు తెలిపారు. వారు గణేశుడిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దేశం ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని గణనాయకుడి వద్ద ప్రార్థించినట్టు చెప్పారు. ఇక ఈ ఏడాది ఖైరతాబాద్ గణేశుడిని ప్రత్యేకంగా “ విశ్వశాంతి మహాశక్తి” రూపంలో అలంకరించడం విశేషమని వారు అన్నారు. మహాగణపతి ప్రతిష్టించిన ప్రతిసారీ భక్తుల కోరికలు తీర్చే వినాయకుడు అని భావిస్తారని పేర్కొన్నారు. దీంతో పాటు గణేశ్ నవరాత్రుల్లో జరిగే సేవా కార్యక్రమాలు ఖైరతాబాద్ గణనాయకుడి విగ్రహాన్ని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుండటం గణనీయమని చెప్పారు.హైదరాబాదు నగరం గణేశ్ ఉత్సవం సమయంలో ఆధ్యాత్మిక కాంతితో నిండిపోతుందని, ప్రతి వీధి గణపయ్య శోభాయాత్రలతో సందడిగా మారుతుందని దంపతులు వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా జ్ఞానేందర్ మాట్లాడుతూ – “మా కుటుంబం తరపున ప్రతి ఏడాది గణనాయకుడిని దర్శించుకోవడం మా భాగ్యం. గణేశుడి దయతో మేము ఎల్లప్పుడూ ప్రజా సేవలో కొనసాగుతాం. మా ట్రస్ట్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా కొనసాగిస్తాం” అని తెలిపారు.