అతిధి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తు చేసుకోండి
ముధోల్ మనోరంజని ప్రతినిధి సెప్టెంబర్ 2
ముధోల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025 – 26 విద్యా సంవత్సరానికి అతిథి అధ్యాపకులుగా పనిచేయుటకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ కర్రోళ్ల బుచ్చయ్య ఒక ప్రకటనలో తెలిపారు . పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో 55% మార్కులు కలిగి ఉండాలన్నారు.అలాగే నెట్, సెట్, పిహెచ్డి అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. సబ్జెక్టుల వారిగా రాజనీతి శాస్త్రము- 1, చరిత్ర- 1, గణిత శాస్త్రము- 1, భౌతిక శాస్త్రంలో- 1 ఖాళీలు (మొత్తం-4)ఉన్నట్లు పేర్కొన్నారు .అర్హులైన అభ్యర్థులు ఈనెల 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు భైంసా గోపాలరావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దరఖాస్తులను చేసుకోవాలని సూచించారు. ఈనెల 6వ తేదీన భైంసా గోపాల్ రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంటర్వ్యూలు ఉంటాయని పేర్కొన్నారు . ఇంటర్వ్యూలు ఉదయం 10:30 నుండి మొదలవుతాయని పేర్కొన్నారు. ఇంటర్వ్యూలకు అభ్యర్థులు తమ ఒరిజినల్ పత్రాలతో హాజరుకావాలని పేర్కొన్నారు.