భీమారం పద్మశాలి గణేష్ మండలి ఆధ్వర్యంలో ఘనంగా కుంకుమార్చన , అన్న ప్రసాద వితరణ.
మంచిర్యాల జిల్లా, మనోరంజని ప్రతినిధి. సెప్టెంబర్ 3.
భీమారం మండల కేంద్రం లోని పద్మశాలి గణేష్ మండలి ఆధ్వర్యంలో వినాయకుని వద్ద కుంకుమార్చన, అన్న ప్రసాద వితరణ ను ఘనంగా నిర్వహించారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో మంగళ హారతులతో వినాయక మండపానికి చేరుకొని, కుంకుమార్చన పూజ ను నిర్వహించారు. పూజా అనంతరం భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.
ఈ కార్యక్రమం లో భీమారం పద్మశాలి సంఘం సభ్యులు, మహిళా భక్తులు,గ్రామ ప్రజలు, కాలనీ వాసులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు