గణిత విజ్ఞాన మేలాలో శిశు మందిర్ విద్యార్థుల ప్రతిభ
ముధోల్ మనోరంజని ప్రతినిధి సెప్టెంబర్ 1
ఆగష్టు -31, సెప్టెంబర్ – 01 తేది లలో శ్రీ సరస్వతీ విద్యాపీఠం ఆధ్వర్యంలో ఆదిలాబాద్ లోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ వినాయక్ చౌక్ పాఠశాలలో జరిగిన ఆదిలాబాద్ విభాగ్ స్థాయి (ఆదిలాబాద్-నిర్మల్ జిల్లాలు) గణిత విజ్ఞాన సంస్కృతీ మేలాలో ముధోల్ మండల కేంద్రములోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాలకు చెందిన 38 మంది విద్యార్థులు బాలవర్గ, కిశోర వర్గ లలో ప్రదర్శనలు, ప్రయోగాలు, క్విజ్ లు, పత్ర సమర్పణ మొదలగు అంశాలలో పాల్గొన్నారు. ఇందులో మోడల్ బేస్డ్ ఆన్ ఫుడ్ ప్రిజర్వేషన్ – స్వప్న – ప్రథమ, మోడల్ బేస్డ్ ఆన్ వాటర్ మేనేజ్మెంట్ – సాత్విక్ – ప్రథమ, న్యూ ఇన్నోవేటివ్ మోడల్ – కె.రోహణ్ – ప్రథమ , కిశోర వర్గ వేదిక్ మ్యాథ్స్ క్విజ్ – ప్రథమ, బాల వర్గ మరియు కిశోర వర్గ – సంస్కృతి జ్ఞాన క్విజ్ – ప్రథమ, స్థానంలో నిలిచి రాష్ట్ర స్థాయి గణిత విజ్ఞాన సంస్కృతీ మేలాకు అర్హత సాధించారు. వీరు ప్రాంత సంఘటన మంత్రి పతకమూరి శ్రీనివాస్ , ఉమ్మడి ఆదిలాబాద్ జెడ్పీ మాజి చైర్మన్ సుహాసిని, విభాగ్ అధ్యక్షులు భజరంగ్ లాల్ అగర్వాల్, విభాగ్ కార్యదర్శి సరుకొండ దామోదర్, శైక్షణిక్ ప్రముఖ్ కలిమహంతి వేణుమాధవ్, విభాగ్ విజ్ఞాన మేళా ప్రముఖ్ కొండూర్ నరేష్ , ఆదిలాబాద్ సబ్ జైలర్ ధరావస్తూ సుధాలక్ష్మి చేతుల మీదుగా బహుమతులు ప్రశంస పత్రాలు అందుకున్నారు. వీరు సెప్టెంబర్ 3,4,5 వ తేదిలలో శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాల కామరెడ్డి పాఠశాలలో జరుగు ప్రాంత స్థాయి గణిత విజ్ఞాన సంస్కృతీ మేలా లో పాల్గొంటారని ప్రధానాచార్యులు సారథి రాజు తెలియజేశారు. గెలుపొందిన విద్యార్థులకు వారి గెలుపుకు కృషి చేసిన ఆచార్యులు గంగామణి , అఖిల, రమేష్ కు ప్రబంధకారిణి సభ్యులు, ప్రధానాచార్యులు, ఆచార్యులు విద్యార్థులు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రాంత స్థాయి లో గెలిచి క్షేత్ర, అఖిల భారత స్థాయి వరకు వెళ్ళాలని ఆకాంక్షించారు.