ముధోల్లో పనిచేయని బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్…!
వినియోగదారులకు తప్పని తిప్పలు
మనోరంజని ప్రతినిధి ఆగస్టు 29
ప్రభుత్వ రంగ సంస్థలైన బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ పనిచేయకపోవడంతో వినియోగదారులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రైవేటు నెట్వర్క్ దీటుగా బిఎస్ఎన్ఎల్ ప్రభుత్వ రంగ సంస్థ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని చేస్తున్న ప్రకటనలు మాటలకి పరిమితం అవుతున్నాయి. క్షేత్ర స్థాయిలో మాత్రం లేదని వినియోగదారులు వాపోతున్నారు. ఇతర నెట్వర్క్లు భారీ వర్షాల్లో సైతం ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ మాత్రం వెనుకబడిపోతుంది. వినియోగదారులను ఆకర్షించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ నెట్వర్క్ సమస్య ఇబ్బందిగా మారుతుంది. ఇతర నెట్వర్క్ కంటే బిఎస్ఎన్ఎల్ లో ప్లాన్ ధరలు తక్కువగా ఉండడంతో ప్రజలు సైతం ఆకర్షితులవుతున్నారు. ఆయిన నెట్వర్క్ సమస్యను పరిష్కరిస్తేనే ప్రజలకు మెరుగైన సేవలు అందే అవకాశం ఉందని ప్రజలు పేర్కొంటున్నారు. బిఎస్ఎన్ఎల్ అధికారులు అత్యవసర పరిస్థితుల్లో నెట్వర్క్ సమస్య తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.