జలదిగ్బంధనంలో మహాత్మాజ్యోతిబాపులే పాఠశాల
విద్యార్థులను ఇంటికి పంపిస్తున్న యాజమాన్యం
పాఠశాల ముందు మోకాలివరకు వరద నీరు
రెండు రోజుల పాటు పాఠశాలకు సెలవు
ముధోల్ మనోరంజని ప్రతినిధి ఆగస్టు 28
మండల కేంద్రమైన ముధోల్లోని సాయి మాధవ్ నగర్ కాలనీలో గలా మహాత్మాజ్యోతిబాపూలే పాఠశాల కురుస్తున్న భారీవర్షానికి జలదిగ్బంధనమయినది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సి పాల్ అమృత వివరాలు కోరగా నిన్నటి నుండి కురు స్తున్న భారీ వర్షం కారణంగా వరద నీరు పాఠశాల లోపల, చుట్టూ చేరడం వలన వరదతో పాటు విషసర్పాలు వచ్చే అ వకాశం ఉందని అన్నారు. మహాత్మ జ్యోతిబాపూలే ఆర్సిఓ సూచన మేరకు విద్యార్థులకు ముందస్తు జాగ్రత్తగా ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారని తెలిపారు