50 వసంతాలు పూర్తి చేసుకున్న సాయిరాం యూత్ గణేష్ మండలి.

50 వసంతాలు పూర్తి చేసుకున్న సాయిరాం యూత్ గణేష్ మండలి.

50 వసంతాలు పూర్తి చేసుకున్న సాయిరాం యూత్ గణేష్ మండలి.

మంచిర్యాల, మనోరంజని ప్రతినిధి. ఆగస్టు 28.

భీమారం మండల కేంద్రం లోని రావి చెట్టు కాలనీ లో సాయిరాం యూత్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రతిష్టిస్తున్న గణనాథుడు 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా గణేష్ ఆగమనాన్ని ఘనంగా నిర్వహించారు. డీజే లతో, భారీ ర్యాలీతో వినాయకుని తీసుకువచ్చి ప్రతిష్టించారు. మొట్ట మొదటి సారిగా 28 ఆగష్టు1976 లో గ్రామపంచాయతి ప్రాంగణంలో ప్రతిష్టించామనీ శ్రీ కోదండ రామాలయ ప్రధాన అర్చకులు తిరుణగిరి కన్నయ్య ఈ సందర్భంగా తెలిపారు, అప్పట్లో గణపతి నవరాత్రి వేడుకల నిర్వహణ కు చాలా కష్టపడాల్సి వచ్చింది అనీ, ఎన్ని అడ్డంకులు ఎదురయినా ఉ త్సవాలు ఆపలేదనీ, 50 సంవత్సరాల వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషం గా ఉందనీ వారు తెలిపారు. స్వామి వారికి ప్రతి రోజు ప్రత్యేక పూజలు,భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు, ఈ కార్యక్రమం లో సాయిరాం యూత్ ఉత్సవ సమితి సభ్యులు, భక్తులు, కాలనీ వాసులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment