భైంసా సాయి నగర్లో తొలి గణేష్ హారతి ఘనంగా నిర్వహణ
భైంసా పట్టణంలోని సాయి నగర్లో గణేష్ కమిటీ ఆధ్వర్యంలో గణేశ్ నవరాత్రుల తొలి హారతి భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది.
కమిటీ అధ్యక్షులు సాయినగర్ కాలిని కుంట విట్టల్ తొలి గణేష్ హారతి సమర్పించి ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై శ్రీ గణేశుని ఆశీస్సులు పొందారు.
కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన కమిటీ సభ్యులను భక్తులు అభినందించారు